మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 13 ఆగస్టు 2018 (17:03 IST)

మీకు కాబోయే భార్య ఎలా వుండాలి?.. శింబును అడిగిన శ్రీరెడ్డి

తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీల్లో సంచలనంగా మారిన శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పిన శ్రీరెడ్డి.. ఇటీవల కోలీవుడ్ ప్రముఖులపై సంచలన కామె

తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీల్లో సంచలనంగా మారిన శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పిన శ్రీరెడ్డి.. ఇటీవల కోలీవుడ్ ప్రముఖులపై సంచలన కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది. అయితే శ్రీరెడ్డి ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తుందని  నడిగర్ సంఘం కొట్టిపారేసింది. కానీ తనవద్ద ఆధారాలున్నాయని.. అవసరమైనప్పుడు బట్టబయలు చేస్తానని శ్రీరెడ్డి చెప్తూనే వుంది. 
 
ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఓ మ్యాగజైన్ నిర్వహించిన కార్యక్రమంలో నెటిజన్లు శింబును అనేక ప్రశ్నలు సంధించారు. అదే సమయంలో శ్రీరెడ్డి కూడా శింబును ఓ ప్రశ్న వేసింది. ''మీరు పెళ్లి చేసుకోబోయే భార్యకు ఎలాంటి లక్షణాలుండాలని?" శ్రీరెడ్డి శింబును ప్రశ్నించింది. అందుకు శ్రీరెడ్డి లిస్టులో తాను లేనని ఊపిరి పీల్చుకున్నాడు. మహిళల హక్కుల గురించి మాట్లాడాడు.