శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 7 ఆగస్టు 2018 (14:41 IST)

క్యాస్టింగ్ కౌచ్ వందశాతం వుంది.. అందుకని కూతుర్ని ఆపలేను.. ఎవరు?

క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి చేసిన పోరాటం గురించి తెలిసిందే. అర్ధనగ్న నిరసనలు చేసిన శ్రీరెడ్డి.. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పింది. తాజాగా ఈ క్యాస్టింగ్ కౌచ్‌పై సీనియర్ నటుడు అర్జు

క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి చేసిన పోరాటం గురించి తెలిసిందే. అర్ధనగ్న నిరసనలు చేసిన శ్రీరెడ్డి.. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పింది. తాజాగా ఈ క్యాస్టింగ్ కౌచ్‌పై సీనియర్ నటుడు అర్జున్ మాట్లాడుతూ... ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని స్పష్టం చేశారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది నూటికి నూరు శాతం నిజమేనని చెప్పారు. 
 
అయితే క్యాస్టింగ్ కౌచ్ వుంది కదాని తన కూతురు ఐశ్వర్యను సినిమాల్లో నటించకుండా ఆపలేనని అర్జున్ స్పష్టం చేశారు. తన కూతురుపై తనకున్న నమ్మకమే దానికి కారణమని చెప్పారు. ఆ నమ్మకంతోనే ఐశ్వర్యకు సినిమాల్లో అవకాశాలు ఇప్పించానని తెలిపారు. 38 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న తానే సినీ రంగాన్ని నమ్మకపోతే, మరెవరు నమ్ముతారన్నారు.
 
మంచి, చెడుల ఎంపిక మన చేతుల్లోనే ఉంటుంది. ఆ ఎంపికను బట్టి మన జీవితం ఉంటుంది. సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని, దాని వల్ల ఏదో అవుతుందని భయపడి తన కుమార్తెను సినిమాల్లో రావద్దని చెప్పలేనన్నారు. మూడున్నర దశాబ్దాలకు పైగా సినిమా రంగంతో మమేకమై జీవిస్తున్న తానే సినీ రంగంలోకి తన కుమార్తెను పంపించేందుకు భయపడితే.. మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటని.. తమకు సినీ పరిశ్రమ అమ్మలాంటిదని.. అదే మాకు అన్నం పెడుతుందని అర్జున్ వ్యాఖ్యానించారు.