1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Mega daughter Niharika comments on Casting Couch

ఒప్పుకుంటేనే ఏదైనా... కాదంటే రేప్ కిందకే వస్తుంది... క్యాస్టింగ్ కౌచ్‌పై నిహారిక

క్యాస్టింగ్ కౌచ్ అంటూ గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి చేస్తున్న హంగామా గురించి వేరే చెప్పక్కర్లేదు. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలోని కొందరి పేర్లు చెప్పి, వాళ్లు తనను వాడుకున్నారంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మెగా ఫ్యామిలీ హీరోయిన్ నిహా

Mega daughter
క్యాస్టింగ్ కౌచ్ అంటూ గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి చేస్తున్న హంగామా గురించి వేరే చెప్పక్కర్లేదు. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలోని కొందరి పేర్లు చెప్పి, వాళ్లు తనను వాడుకున్నారంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మెగా ఫ్యామిలీ హీరోయిన్ నిహారిక క్యాస్టింగ్ కౌచ్ పైన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఆమె మాట్లాడుతూ... క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఒక్క సినీ పరిశ్రమలో మాత్రమే లేదు. 
 
చాలా రంగాల్లో ఇది వున్నదని నేను విన్నానని చెప్పుకొచ్చారు. అసలు ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎవరైనా తమకు తాము అంగీకరిస్తేనే అవుతుందనీ, తన అంగీకారం లేకుండా జరిగితే అది రేప్ కిందకు వస్తుందని అన్నారు. జరిగిపోయిన తర్వాత తనకు ఇలా జరిగింది.. అలా జరిగింది అనుకుంటే ఉపయోగం లేదు... ఏదయినా ముందే ఆలోచించుకోవాలని అంది. తనకు ఏ దారి లేదన్నప్పుడు మాత్రమే కొందరు అలాంటి ఉచ్చులో చిక్కుకున్నట్లు తను విన్నట్లు చెప్పారు. ఐతే తను అటువంటి వాళ్ల స్థానంలో వుండి మాట్లాడలేననీ, తనకు అలాంటి పరిస్థితి లేదని వెల్లడించారు.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
రాశి ఖన్నాను చూసేందుకు ఎగబడ్డ అభిమానులు...