శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 19 ఆగస్టు 2018 (12:57 IST)

'ఆర్ఎక్స్ 100' హీరోయిన్‌ను పడకగదికి రమ్మని పిలిచిన నిర్మాత... పాయల్ కాంప్రమైజ్ అయిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై అనేక మంది హీరోయిన్లు స్పందిస్తున్నారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కొత్త హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా కామెంట్స్ చేసింది. పైగా, ఈమెను కూడా ఓ వ్యక్తి పడక

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై అనేక మంది హీరోయిన్లు స్పందిస్తున్నారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కొత్త హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా కామెంట్స్ చేసింది. పైగా, ఈమెను కూడా ఓ వ్యక్తి పడక గదికి రమ్మని పిలిచినట్టు చెప్పింది. కానీ, తాను కాంప్రమైజ్ కాలేదని స్పష్టం చేసింది.
 
ఈ క్యాస్టింగ్ కౌచ్‌పై పాయల్ రాజ్‌పుత్ స్పందిస్తూ, టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల్లో అవకాశాలు ఇస్తామని చెప్పి, అమ్మాయిలను పడకగదికి రమ్మని పిలవడం వంద శాతం నిజమని చెప్పింది. తాను నటించిన తొలి చిత్రం ఆర్ఎక్స్ 100లో బోల్డ్ పాత్రలో కనిపించినందువల్ల, తాను అటువంటి క్యారెక్టర్ అమ్మాయినే అనుకున్నట్టుగా ఉన్నారని తెలిపారు. నిజానికి నాలుగు రోజుల క్రితం తనను కాంప్రమైజ్ కావాలని ఒకరు ప్రపోజ్ చేశారని చెప్పింది. 
 
'ఐయామ్ రియల్లీ షాక్డ్. ఇటువంటి కోరికతో ఒకరు నా ముందుకు వచ్చారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. నేను కాంప్రమైజ్ అయి ఈ స్థాయికి రాలేదు. నేను టాలెంట్‌తోనే వచ్చాను. నేను చెప్పదలచుకున్నది అదే' అని చెప్పింది. తన జీవితంలో ఎన్నడూ కాంప్రమైజ్ అయ్యేపనే లేదని కుండబద్ధలు కొట్టింది. ఇక తనను ఇలా అడిగింది ఎవరన్న విషయాన్ని మాత్రం ఈ భామ వెల్లడించలేదు.