సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By srinivas
Last Modified: మంగళవారం, 14 ఆగస్టు 2018 (14:52 IST)

RX 100 మూవీ రీమేక్ హీరో ఎవ‌రో తెలుసా..?

చిన్న సినిమాగా విడుదలై.. పెద్ద విజయం సొంతం చేసుకుని సంచ‌ల‌నం సృష్టించిన‌ చిత్రం ఆర్ఎక్స్ 100. కార్తికేయ, పాయల్‌ రాజ్‌ జంట‌గా న‌టించిన ఈ చిత్రాన్ని అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించారు. రావు రమేశ్‌, రాంకీ ప్రధాన పాత్రలు పోషించారు. గత నెల 12న విడుదలైన ఈ సినిమా

చిన్న సినిమాగా విడుదలై.. పెద్ద విజయం సొంతం చేసుకుని సంచ‌ల‌నం సృష్టించిన‌ చిత్రం ఆర్ఎక్స్ 100. కార్తికేయ, పాయల్‌ రాజ్‌ జంట‌గా న‌టించిన ఈ చిత్రాన్ని అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించారు. రావు రమేశ్‌, రాంకీ ప్రధాన పాత్రలు పోషించారు. గత నెల 12న విడుదలైన ఈ సినిమా విమర్శకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబట్టింది. ఈ డైరెక్ట‌ర్‌కి పెద్ద నిర్మాణ సంస్థ‌ల నుంచి వ‌రుస‌గా ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. 
 
అయితే... తెలుగులో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ సినిమాని త‌మిళ్‌లో రీమేక్ చేసేందుకు చాలామంది హీరోలు పోటీప‌డ్డారు. ఫైన‌ల్‌గా ఈ మూవీ త‌మిళ్ రీమేక్‌లో ఆది పినిశెట్టి హీరోగా న‌టించ‌నున్నాడ‌ని తెలిసింది. ఔర సినిమాస్‌ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరి ఇందులో కథానాయికగా ఎవరు నటించనున్నారో తెలియాల్సి ఉంది. ఆది ప్రస్తుతం యూటర్న్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఆది న‌టించిన‌ నీవెవరో చిత్రం ఈ నెల 24న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.