మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 ఆగస్టు 2018 (16:06 IST)

హీరో అజిత్ దర్శకుడు అనుమానాస్పద మృతి.. సినీ ఇండస్ట్రీ షాక్

తమిళ హీరో అజిత్‌‌తో చిత్రం తీసిన దర్శకుడు సి.శివకుమార్ అనుమానాస్పదరీతిలో చనిపోయాడు. ఆయన మరణవార్త విన్న కోలీవుడ్ ఇండస్ట్రీ ఒకింత షాక్‌‌కు గురైంది. పైగా, ఆయన మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. దీంతో

తమిళ హీరో అజిత్‌‌తో చిత్రం తీసిన దర్శకుడు సి.శివకుమార్ అనుమానాస్పదరీతిలో చనిపోయాడు. ఆయన మరణవార్త విన్న కోలీవుడ్ ఇండస్ట్రీ ఒకింత షాక్‌‌కు గురైంది. పైగా, ఆయన మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. దీంతో ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
సినీ హీరో, దర్శకుడు కె. భాగ్యరాజ్ వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన పి. శివకుమార్ ఆ తర్వాత సొంతగా దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు. తొలుత హీరో అజిత్‌తో ఓ చిత్రం, ఆ తర్వాత అర్జున్‌లతో మరో చిత్రాన్ని నిర్మించాడు. ఈ రెండు సినిమాల్లో అజిత్‌తో చేసిన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. 
 
ఈ నేపథ్యంలో చెన్నై సాలిగ్రామంలోని తన నివాసంలో ఆయన శవమై కనిపించాడు. ఆయన మరణవార్త సినీ ఇండస్ట్రీకి షాకింగ్‌గా అనిపించింది. ఆయన మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. పోలీసులు కూడా ఆయన మృతికి సంబంధించిన కారణాలను వెల్లడించలేకపోతున్నారు.