శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (10:23 IST)

నేనెందుకు నచ్చలేదో తెలుగు నిర్మాతలనే అడగండి : డైసీ షా

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన కుర్రకారు హీరోయిన్లలో డైసీ షా ఒకరు. ఈమె 'జ‌య‌హో', 'హేట్ స్టోరీ 3' వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్‌గా మార‌క‌ముందు మోడ‌ల్‌గా, డ

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన కుర్రకారు హీరోయిన్లలో డైసీ షా ఒకరు. ఈమె 'జ‌య‌హో', 'హేట్ స్టోరీ 3' వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్‌గా మార‌క‌ముందు మోడ‌ల్‌గా, డాన్స‌ర్‌గా ఆమెకు మంచి పాపులారిటీ ఉంది. తాజాగా ఈమె ఓ షోరూమ్ ప్రారంభోత్స‌వం కోసం హైద‌రాబాద్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా తెలుగు సినిమాల గురించి, హీరోల గురించి మాట్లాడింది.
 
'నాకు హైద‌రాబాద్‌తో మంచి అనుబంధం ఉంది. షూటింగ్‌ల కోసం ప‌లుసార్లు ఇక్క‌డ‌కు వ‌చ్చాను. 'జ‌య‌హో' షూటింగ్ ఇక్క‌డే జ‌రిగింది. నాకు భాష ముఖ్యం కాదు. అన్ని భాష‌ల్లోనూ న‌టించ‌డానికి నేను సిద్ధ‌మే. తెలుగులో న‌టించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇక్క‌ణ్నుంచి అవ‌కాశాలు రాక‌పోవ‌డ‌మే. ఆ విష‌యం తెలుగు నిర్మాత‌ల‌ను అడ‌గాలి. చిరంజీవి, మ‌హేష్ బాబు, నాగార్జున‌, రాం చ‌ర‌ణ్‌ల న‌ట‌న నాకు చాలా ఇష్టం' అని చెప్పుకొచ్చింది.