సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (17:18 IST)

రవితేజ-ఇలియానా-శ్రీను వైట్ల‌.. ఆ సినిమా ఎలా వుంటుంది?

ర‌వితేజ‌, ఇలియానా జంట‌గా న‌టిస్తున్నచిత్రం అమ‌ర్ అక్బర్ ఆంటోనీ. ఈ చిత్రానికి శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో హీరోహీరోయిన్లపై చివరి పాట చిత్రీక‌ర‌ణ పూర్తి చేసారు. దీంతో షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్

ర‌వితేజ‌, ఇలియానా జంట‌గా న‌టిస్తున్నచిత్రం అమ‌ర్ అక్బర్ ఆంటోనీ. ఈ చిత్రానికి శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో హీరోహీరోయిన్లపై చివరి పాట చిత్రీక‌ర‌ణ పూర్తి చేసారు. దీంతో షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది. శ్రీను వైట్ల‌ పుట్టిన రోజు కానుక‌గా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ పాత్రల‌ను ప‌రిచ‌యం చేసారు. ఇది చాలా కొత్త‌గా.. సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచేలా ఉంది. 
 
ర‌వితేజ మూడు గెట‌ప్స్ ట్రెండింగ్‌లో ఉంటూ.. ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. అందులో మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించారు ర‌వితేజ‌. ఈ చిత్రం పూర్తిగా స‌రికొత్త క‌థ‌.. భిన్న‌మైన‌ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. 
 
ఈ సినిమాలో ల‌య‌, సునీల్, వెన్నెల కిషోర్, ర‌ఘు బాబు, త‌రుణ్ అరోరా,అభిమ‌న్యు సింగ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. యుఎస్‌లోని అంద‌మైన లొకేష‌న్స్‌లో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ చిత్రాన్ని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల‌. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. హ్యాట్రిక్ నిర్మాణ సంస్థ‌ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
 
ర‌వితేజ‌, ఇలియానా డీ క్రూజ్, సునీల్, ల‌య‌, వెన్నెల కిషోర్, ర‌విప్ర‌కాశ్, త‌రుణ్ అరోరా, ఆదిత్య మీన‌న్, అభిమ‌న్యు సింగ్, విక్ర‌మ్ జిత్, రాజ్ వీర్ సింగ్, శియాజీ షిండే, శుభ‌లేక సుధాక‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ సినిమా పై శ్రీను వైట్ల చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి..స‌రైన స‌క్స‌స్ కోసం ఎదురుచూస్తోన్న శ్రీను వైట్ల‌కు అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని విజ‌యాన్ని అందిస్తుంద‌ని ఆశిద్దాం.