శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: బుధవారం, 18 జులై 2018 (19:48 IST)

మాస్ మహారాజుకు తేరుకోలేని కష్టాలు.. ఎందుకంటే?

రవితేజ సినిమా మళ్ళీ బాక్ పెవిలియన్ అన్న విధంగా మారింది. రవితేజతో రెండు సినిమాలను ప్రారంభించిన నిర్మాణ సంస్ధ ఒక సినిమాను పక్కన బెట్టింది. ఇప్పుడు రవితేజతో చేస్తున్న సినిమా ఆడితే మరో సినిమా చేయాలా వద్దా అన్న నిర్ణయం తీసుకుంటారట. రవితేజకు ఇలా లేవలేని షా

రవితేజ సినిమా మళ్ళీ బాక్ పెవిలియన్ అన్న విధంగా మారింది. రవితేజతో రెండు సినిమాలను ప్రారంభించిన నిర్మాణ సంస్ధ ఒక సినిమాను పక్కన బెట్టింది. ఇప్పుడు రవితేజతో చేస్తున్న సినిమా ఆడితే మరో సినిమా చేయాలా వద్దా అన్న నిర్ణయం తీసుకుంటారట. రవితేజకు ఇలా లేవలేని షాక్ తగిలింది.
 
మాస్ మహారాజుకు సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఆయన సినిమాకు కష్టాలు షురూ అయ్యాయి. రవితేజతో  ఇటీవల రెండు సినిమాలను ప్లాన్ చేశారు. అయితే అందులో ఒక సినిమాను పక్కన పెట్టేశారు. రవితేజ రెండు ఫ్లాప్ లు ఇవ్వడంతో నిర్మాతలకు అపనమ్మకం కలుగుతోందట. 
 
రవితేజతో మైత్రీ మూవీస్ రెండు సినిమాలను ప్లాన్ చేసింది. అందులో ఒక సినిమా అమర్, అక్బర్, యాంటోని ఒకటి. ఈ సినిమాకు దర్శకుడు శ్రీనువైట్ల. సినిమా షూటింగ్ బాగా జోరుగా సాగుతోంది. మరొకటి కందిరీగ డైరెక్టర్‌తో మూవీ. కందిరీగ డైరెక్టర్ తో వారంరోజుల పాటు సినిమా షూటింగ్ జరుపుకుని సినిమా ఆగిపోయింది. ప్రస్తుతానికి ఈ సినిమాను నిలిపివేశారట. 
 
రవితేజ వరుసగా ఫ్లాప్ లు ఇవ్వడంతో ఒకటైంలో దర్సక, నిర్మాతలు వెనక్కి తగ్గారు. సంవత్సరం తరువాత రాజా దిగ్రేట్ సినిమా తీశారు. ఆ సినిమా బాగానే ఆడింది.  ఆ తరువాత రెండు సినిమాలు తీశారు టచ్ చేసి చూడు, నేల టిక్కెట్లు వచ్చాయి. ఆ సినిమాలు కోట్ల రూపాయల్లో నష్టాలు వచ్చాయి. దీంతో మొదట్లో రెండు సినిమాలు తీయాలనుకున్న నిర్మాణ సంస్ధ ఒక సినిమాను పక్కనబెట్టి ఒక సినిమాను మాత్రమే తీయాలని నిర్ణయించుకుందట.