శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 11 డిశెంబరు 2018 (18:49 IST)

నా అర్థాంగికి తొలి వార్షికోత్సవ శుభాకాంక్షలు.. విరాట్ కోహ్లీ

భారత సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల రాశి అనుష్క శర్మ పెళ్లి జరిగి ఏడాది పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో తొలి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తన భార్య అనుష్కకు ట్విట్టర్ ద్వారా విరాట్ కోహ్లీ మంగళవారం శుభాకాంక్షలు తెలియజేశారు. అప్పుడే ఏడాది గడిచిపోయిందంటే.. అస్సలు నమ్మలేకపోతున్నానని.. మా వివాహం నిన్నే జరిగినట్లుందని కోహ్లీ ట్వీట్ చేశాడు. 
 
తన ప్రాణ స్నేహితురాలు, తన అర్ధాంగికి వార్షికోత్సవ శుభాకాంక్షలు.. నువ్వెప్పటికీ నా దానివేనని కోహ్లీ ట్విట్టర్లో తెలిపారు. కాగా, కోహ్లీ, అనుష్కల వివాహం ఇటలీలో జరిగిన సంగతి తెలిసిందే. తొలి వివాహ వార్షికోత్సవాన్ని ఆస్ట్రేలియాలో జరుపుకుంది. ఆసీస్‌తో సిరీస్ నిమిత్తం కోహ్లీ అక్కడే ఉన్న సంగతి తెలిసిందే. వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం అనుష్క కూడా ఆస్ట్రేలియా వెళ్లిన సంగతి తెలిసిందే.