శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 19 నవంబరు 2018 (11:48 IST)

టీమిండియాకు దొరికిన విలువైన ఆస్తి ధోనీ.. కపిల్ దేవ్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫామ్‌ గురించి క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించాడు. ధోనీ ఫామ్‌లో లేడని చెప్పేందుకు ధోనీ 20 లేదా 25 ఏళ్ల కుర్రాడు కాదని చెప్పారు. ధోనీ నుంచి ఏం ఆశిస్తున్నారో తనకు అర్థం కావట్లేదని కపిల్ దేవ్ అడిగాడు. విరాట్ కోహ్లీ ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఆటగాడని కపిల్ ప్రశంసించారు. అనుభవం, టాలెంట్ కలిస్తే కోహ్లీ అని చెప్పాడు. 
 
అంతులేని ప్రతిభ, కష్టపడే తత్వం ఉన్న ఆటగాడని కితాబిచ్చారు. మ్యాచ్‌లు గెలవటం.. ఓడిపోవడమనేది ప్రధాన అంశం కాదని.. మ్యాచ్ ఎలా ఆడారనేదే ముఖ్యమని తెలిపాడు. అలాగే ధోనీ చేసిన సేవలను మర్చిపోతే ఎలా అని ప్రశ్నించాడు. 
 
ధోనీకి ఎంతో అనుభవం వుందని.. క్లిష్ట పరిస్థితుల్లో తెలివైన నిర్ణయాలను తీసుకుని జట్టును విజయాల బాటలో నడిపించాడని.. ఆ అనుభవమే భారత్‌కు ఉపయోగపడవచ్చునని చెప్పాడు. టీమిండియాకు దొరికిన విలువైన ఆస్తి ధోనీ అని కితాబిచ్చారు. భారత్ తరపున ధోనీ మరిన్ని మ్యాచ్‌లు ఆడతాడని తెలిపాడు.