శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (16:10 IST)

ఆస్ట్రేలియా గడ్డపై దశాబ్దం తర్వాత చరిత్ర సృష్టించిన టీమిండియా

ఆస్ట్రేలియా గడ్డపై భారత క్రికెట్ జట్టు విజయభేరీ మోగించింది. తద్వారా టీమిండియా సరికొత్త చరిత్రను సృష్టించింది. దీంతో భారత క్రికెట్ అభిమానుల చిరకాల వాంఛ నెరవేరింది. అడిలైడ్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సేన చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో భారత్ తొలిసారిగా టెస్ట్ క్రికెట్‌లో విజయం సాధించింది. 
 
నాలుగు టెస్టుల సిరీస్‌లో మొదటి టెస్టు గెలిచి బోణి కొట్టింది. తొలి టెస్టులో ఆసీస్ జట్టుపై 31 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ విజయంతో కెప్టెన్ కోహ్లీ దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో టెస్ట్ గెలిచిన భారత కెప్టెన్‌గా అరుదైన ఘనత సాధించాడు. 2008లో జనవరి 16-20 మధ్య జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌లో జట్టుకు కెప్టెన్‌గా అనిల్ కుంబ్లే వ్యవహరించాడు. తర్వాత జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించలేకపోయింది. మళ్లీ అథిత్య జట్టు గడ్డపైనే కోహ్లీ సేన కంగారులను చిత్తుచేశాడు. 
 
ఆస్ట్రేలియా గడ్డపై గత చరిత్రను తిరగేస్తే, 1947 నుంచి ఇప్పటివరకు టీమిండియా మొత్తం 12 సార్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. 9 సార్లు ఆతిథ్య విజయం సాధించగా, కేవలం మూడు సార్లు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. కానీ, ఇపుడు, ఆసీస్ గడ్డపై అందని ద్రాక్షగా మిగిలిపోయిన మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది. 
 
ఆ తర్వాత 2014-15లో ఆసీస్ గడ్డపై చివరిసారిగా భారత్ జట్టు నాలుగు టెస్టుల సిరీస్ ఆడింది. విరాట్ కోహ్లీ మొత్తం 8 ఇన్నింగ్స్‌ల్లో 692 పరుగులు సాధించాడు. ఆసీస్‌ గడ్డపై టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆసీస్‌పై తొమ్మిది టెస్లుల్లోనే 1000 పరుగులు చేసిన నాలుగో భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.