ఆ విషయంలో సచిన్, ధోనీని వెనక్కి నెట్టేసిన కోహ్లీ..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మాజీ సారథి ధోనీని వెనక్కి నెట్టేశాడు. ఫోర్బ్స్ విడుదల చేసిన తాజా జాబితాలో 2018వ సంవత్సరం అత్యధిక ఆదాయం సంపాదించిన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు.
అత్యధిక ఆదాయం సంపాదించే వందమంది సెలెబ్రిటీల జాబితాలో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ (రూ.253 కోట్ల 25లక్షలతో) అగ్రస్థానంలో నిలిచాడు. సల్మాన్ తర్వాతి స్థానంలో రూ.228.09 కోట్లతో కోహ్లీ నిలిచాడు. రూ.185 కోట్లతో 2పాయింట్ఓ విలన్ అక్షయ్ కుమార్ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
ఇక క్రీడాకారుల జాబితాలో కోహ్లీ గత ఏడాది రూ.100.72 కంటే ఈ ఏడాది రూ.228.09కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో వుండగా, కోహ్లీకి తర్వాతి స్థానంలో ధోనీ (రూ.101.77కోట్లతో), మూడో స్థానంలో రూ.80 కోట్లతో క్రికెట్ దేవుడు సచిన్ నిలిచారు. నాలుగో స్థానంలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (రూ.36కోట్ల 50లక్షలు) నిలిచింది.