మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (18:43 IST)

గుడ్డులోని తెల్ల సొనను తీసుకుని...?

కోడిగుడ్డు ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నట్లే... సౌందర్య పోషణలోనూ కోడిగుడ్డు దివ్యౌషధంగా పనిచేస్తుంది. చర్మానికి, శిరోజాల సంరక్షణకి కోడిగుడ్డు ఎంతో పనిచేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.
 
గుడ్డులోని తెల్ల సొనను తీసుకుని, అందులో కొంచెం కొబ్బరి నూనె కలిపి, బాగా మిక్స్ చేసి ముఖానికి, మెడకు పట్టించాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం జిడ్డు లేకుండా కాంతివంతంగా అవుతుంది. 
 
ఒక కోడిగుడ్డు తీసుకుని, దానిలోని సొనను ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే.. చర్మం గట్టిపడడమే కాకుండా, కాంతివంతంగా తయారవుతుంది. గుడ్డులోని పచ్చ సొనలో కొంచెం తేనె, పెరుగు కలిపి ముఖానికి పట్టించి, 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే.. మెరిసే అందమైన చర్మం మీ సొంతంమవుతుంది.
 
కేశసంరక్షణ కోసం.. ఒక గుడ్డు, పెరుగు, 1 స్పూన్ ఆలివ్ నూనె, కొంచెం బాదం నూనె కలిపి, ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకి పట్టించి 45 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, మిల మిల మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది. అలానే కొంచెం నిమ్మరసం తీసుకుని, గుడ్డుని కలిపి మీ జుట్టుకి పూర్తిగా పట్టించాలి, ఒక అరగంట తరువాత మీ షాంపూతో తలస్నానం చేస్తే హెయిర్ ఫాల్ ఉండదని సౌందర్య నిపుణులు అంటున్నారు.