గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (13:56 IST)

దానిమ్మ, తేనెతో ఫేస్‌ప్యాక్ వేస్తే.. ఏమవుతుందో తెలుసా..?

చలికాలంలో చర్మ రక్షణ కోసం ఏవోవే క్రీములు, ఫేస్‌ప్యాక్స్ వాడుతున్నారు. వీటి వాడకం మంచిది కాదంటున్నారు బ్యూటీ నిపుణులు. వీటిల్లోని కెమికల్స్ చర్మం తాజాదానాన్ని కోల్పోయేలా చేస్తాయి. దాంతో చిన్న వయస్సులోనే ముఖం ముడతలుగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే.. ఈ కెమికల్స్‌లో పలురకాల చెడు బ్యాక్టీరియాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 
 
ఇలాంటి క్రీమ్స్ వాడితే చర్మం అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. కనుక బయటదొరికే వాటిని మాత్రం ఎప్పుడూ వాడకండి. చర్మం అందంగా ఉండాలంటే.. మరి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు.. ఇంట్లోని సహజసిద్ధమైన పదార్థాలతో అందమైన మరియు కాంతివంతమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చును.. అవేంటో ఓసారి పరిశీలిద్దాం...
 
దానిమ్మ శరీరంలోని రక్తాణ్ని పెంచేందుకు ఎంతో దోహదం చేస్తుంది. దీన్ని జ్యూస్ రూపంలో తాగితే.. గుండె వ్యాధులు రావు. ఇలాంటి దానిమ్మతో ప్యాక్ వేసుకోవడం ఎలాగంటే.. పావుకప్పు దానిమ్మ గింజలు అందులో స్పూన్ తేనె కలిపి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని అరగంట పాటు అలానే ఉంచి.. ఆ తరువాత రోజ్‌వాటర్‌తో కడిగేయాలి. ఇలా ఓ వారం రోజుల పాటు క్రమంగా చేస్తే ముఖచర్మం యవ్వనంగా మారుతుంది.
 
టమోటా ప్రతీ ఇంట్లో తప్పనిసరిగా ఉంటుంది. మరి దీంతో ప్యాక్ వేసుకోవడం ఎలాగంటే.. టమోటాను గుజ్జులా చేసుకుని దాని రసాన్ని మాత్రం వేరుచేసుకోవాలి. ఈ రసంలో కొద్దిగా నిమ్మరసం, అరటిపండు గుజ్జు కలిపి ముఖానికి పట్టించాలి. ఆపై 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా రెండువారాల పాటు చేస్తే.. చలికాలం కారణంగా పొడిబారిన చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.