పాలలో ముల్తానీ మట్టి చేర్చి..?
పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలలో యాంటీ ఆక్సిడెంట్స్, న్యూటియన్ ఫాక్ట్స్ చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి. చాలామందికి చిన్న వయస్సులోనే ముఖం ముడతలుగా మారుతుంది. దీని కారణంగా పదిమందిలో తిరగాలంటే కూడా చాలా కష్టంగా ఉందని బాధపడుతున్నారా.. వద్దు వద్దూ.. ఈ కింది చిట్కాలు పాటించండి... తప్పక ఫలితం ఉంటుంది.
1. పావుకప్పు పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారం రోజుల పాటు క్రమంగా చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
2. పాలలోని యాంటీ ఫంగల్ గుణాలు చర్మంపై గల మృతుకణాలను తొలగిస్తాయి. 2 స్పూన్ల పాలలో కొద్దిగా తేనె, ముల్తానీ మట్టీ కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చాలు.
3. మీగడలో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. గంట తరువాత ముఖాన్ని ఓ 5 నిమిషాల పాటు మర్దన చేసి ఆ తరువాత నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమంగా చేస్తే ముడతలు చర్మం పోతుంది.