శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (11:00 IST)

కలబంద ఆకులను కొద్ది నీళ్లల్లో మరిగించి..?

కలబంద ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది. కలబందను ఆహార పదార్థాల్లో, శీతల పానీయాలలో కూడా వాడుతారు. వైద్యపరంగా కూడా దీనికెంతో ప్రాధాన్యత ఉంది. అందానికైతే ఇక చెప్పనక్కర్లేదు. చర్మ సమస్యలతో బాధపడేవారికి కలబంద ఫేస్‌ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. మరి ఆ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం...
 
2 స్పూన్ల కలబంద గుజ్జులో కొద్దిగా పెరుగు, దోసకాయ రసం, రోజ్ వాటర్ వేసి బాగా పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని ఓ 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కుని మెత్తని బట్టతో తుడుచుకోవాలి. ఇలా క్రమంగా చేయడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది. 
 
కలబంద ఆకులను కొద్ది నీళ్లల్లో మరిగించుకోవాలి. ఆపై అందులో తేనె కలిపి.. పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు పూసుకుని అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒక్కసారి చేసినా జిడ్డుగా పోతుంది.
 
2 స్పూన్ల కలబంద గుజ్జులో కొద్దిగా జున్ను, దోసకాయ ముక్కలు. నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖచర్మానికి రాసుకుని 20 నిమిషాలు అలానే ఉంచుకోవాలి. ఇలా వారంపాటు చేస్తే ముఖం మృదువుగా మారుతుంది. దాంతో పాటు నల్లటి మచ్చలు కూడా తొలగిపోతాయి.