సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 9 మార్చి 2019 (11:29 IST)

వేసవిలో నిమ్మ, పెరుగు పూతతో చర్మానికి ఎంతో మేలు...

వేసవిలో నిమ్మ చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో ఉండే విటమిన్‌ సి, సిట్రిక్‌ ఆమ్లం బ్లీచింగ్‌ ఏజెంట్‌గా పని చేస్తుంది. ఇది నల్లమచ్చలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. పెరుగు, నిమ్మ మిశ్రమం మృదువైన, నిగనిగలాడే చర్మం కోసం ఉపయోగపడతాయి. దీనికి చక్కెర కూడా కలపొచ్చు. చక్కెర మృతకణాలను కూడా తొలగిస్తుంది. ఇలా వేసవిలో చేయడం ద్వారా చర్మానికి తగిన తేమ లభిస్తుంది. 
 
అలాగే మజ్జిగలో లాక్టిక్‌ ఆమ్మం ఎక్కువ. ఇది ముఖంపై ఉండే మృతకణాలు, నల్లమచ్చలు తొలగిస్తుంది. మజ్జిగను దూది సహాయంతో ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేస్తే ఫలితం కనిపిస్తుంది. ఇలా వేసవిలో పెరుగు, నిమ్మరసం, మజ్జిగను ఆహారంలో చేర్చుకున్నా.. ఫేస్ ప్యాకులా ఉపయోగించుకున్నా మంచి ఫలితం వుంటుంది. 
 
అలాగే  బొప్పాయి గుజ్జును ముఖానికి రాసుకోవడం వల్ల వేసవిలో చర్మానికి నిగారింపు వస్తుంది. బొప్పాయి గుజ్జులో టేబుల్‌ స్పూను తేనె కలపాలి. ఒక వేళ పొడిబారిన చర్మం అయితే ఈ మిశ్రమానికి క్రీం కలపాలి. జిడ్డు చర్మం ఉన్నవారు అరచెంచా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. దీనివల్ల ముఖంపై ఉండే నల్ల మచ్చలు తొలిగిపోతాయి.