గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (13:48 IST)

వేసవికాలంలో దహీ వడను తీసుకుంటే.. ఆరోగ్యానికి ఢోకా లేదు...

పెరుగు వేసవికాలంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగును నేరుగా తీసుకోవడం కంటే, అందులో నీరు కలిపి బాగా చిలికించి లేదా మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసి అదులో నీరు ఎక్కువగా పోసి తీసుకోవడం వల్ల వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది. ప్రత్యేకంగా వేసవిలో తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ తగ్గిస్తుంది. అలాంటి పెరుగుతో దహి పూరీ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు 
మినపప్పు - పావు కేజీ 
చాట్ మసాలా - ఒక స్పూన్ 
వెల్లుల్లి తరుగు - ఒక కప్పు 
కొత్తిమీర తరుగు- పావు కప్పు 
టమోటా తరుగు - అర కప్పు
బంగాళాదుంప తురుము - పావు కప్పు 
స్వీట్ పెరుగు - రెండు కప్పులు
ఉప్పు- తగినంత 
 
తయారీ విధానం.. 
ముందుగా రాత్రి మినప్పప్పును నానబెట్టాలి. మరుసటి రోజు బాగా మెత్తగా రుబ్బి, ఉప్పు కలిపి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె కాగాక ఈ పిండిని చిన్నచిన్న గారెల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి వేయించి తీసి నీళ్లలో వేసి ఒక నిమిషం నానబెట్టి తీసేయాలి. ఒక పాత్రలో పెరుగు వేసి చిక్కగా చిలకరించి, అందులో ఉప్పు, పంచదార, జీరాపొడి, మిరప్పొడి వేసి కలిపి, వేయించి ఉంచుకున్న గారెలను ఇందులో వేయాలి. ఆ తర్వాత కొత్తిమీర తరుగు, అల్లం తురుములు, టమోటా తరుగు, వెల్లుల్లి తరుగు, చాట్ మసాలా పైన చల్లాలి. చివరిగా పుదీనా చట్నీలతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేయాలి. దహీ వడ రెడీ అయినట్లే.