మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (13:37 IST)

హెల్తీ స్నాక్స్.. మొక్కజొన్న వడలు..?

కావలసిన పదార్థాలు:
మొక్కజొన్న పొత్తులు - 2
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 4
కొత్తిమీర - కొద్దిగా
కరివేపాకు - కొద్దిగా
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర - స్పూన్
ఉప్పు - సగినంత
నూనె - సరిపడా
శెనగపిండి - 2 స్పూన్స్
కార్న్‌ఫోర్ - 2 స్పూన్స్
 
తయారీ విధానం:
ముందుగా మొక్కజొన్న పొత్తును ఒలిచి పెట్టుకోవాలి. ఆపై వీటిలో ఉప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముఖ్యంగా గ్రైండ్ చేసేప్పుడు నీరు వాడకూడదు. ఈ మిశ్రమంలో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపి కార్న్‌ఫ్లోర్ జతచేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ పొత్తులు లేతగా ఉంటే.. శెనగపిండి కలుపుకోవచ్చు. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా ఒత్తుకుని నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే... వేడివేడి మొక్కజొన్న వడలు రెడీ అయినట్లే..