రిబ్బన్ మురుకు...?
కావలసిన పదార్థాలు:
బియ్యం పిండి - 2 కప్పులు
శెనగపిండి - 1 కప్పు
వాము - 2స్పూన్స్
పసుపు - పావు స్పూన్
ఉప్పు - సరిపడా
మిరప కారం - అరస్పూన్
నూనె - సరిపడా.
తయారీ విధానం:
ముందుగా ఓ పాత్రలో బియ్యం పిండి, సెనగ పిండి, వాము, ఉప్పు, పసుపు, మిరపకారం వేసి కొద్దికొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు జతచేస్తూ జంతికల పిండిలా కలుపుకోవాలి. జంతికల గొట్టంలో రిబ్బన్ మురుకులు తయారుచేసే అచ్చు ఉంచాలి. ఆపై జంతికల గొట్టంలో కొద్దిగా తడి చేయాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి జంతికల గొట్టంతో రిబ్బన్ మాదిరిగా వేసి దోరగా వేగాక పేవర్‌టవల్ మీదకు తీసుకోవాలి. ఆ నూనె కొన్ని కరివేపాకులు వేసి వేయించి రిబ్బన్ మురుకులలో కలపాలి. అంతే... రిబ్బన్ మురుకు రెడీ.