అన్నంతో వడలు ఎలా చేయాలి..?

Last Updated: గురువారం, 28 ఫిబ్రవరి 2019 (10:50 IST)
కావలసిన పదార్థాలు:
అన్నం - 200 గ్రా
మైదా - 50 గ్రా
క్యారెట్స్ - 350 గ్రా
కార్న్‌ఫోర్ - 25 గ్రా
నీరు - 50 మి.లీ.
ఆలుగడ్డలు - 50 గ్రా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
గరంమసాల - 1 స్పూన్
కొత్తిమీర - 2 స్పూన్స్
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా.

తయారీ విధానం:
ముందుగా ఆలుగడ్డలు, క్యారెట్లు చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉడికించి, ఉల్లిపాయల్ని దోరగా వేగించి పక్కనుంచుకోవాలి. అన్నం వండాక చల్లారనిచ్చి అందులో కూరగాయ ముక్కల్ని, ఉల్లిపాయల్ని, కొత్తిమీర, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాత్రలో కార్న్‌ఫ్లోర్ మైదాలను జారుగా కలుపుకోవాలి. ఇప్పు అన్నం మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి జారులో ముంచి, మరోసారి అన్నంలో పొర్లించి నూనెలో దోరగా వేగించి తీయాలి. అంతే అన్నం వడలు రెడీ.దీనిపై మరింత చదవండి :