సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (11:19 IST)

కరివేపాకు పప్పు తయారీ విధానం..?

కావలసిన పదార్థాలు:
కరివేపాకు - అరకప్పు
పెసరపప్పు - అరకప్పు
శెనగపప్పు - 1 స్పూన్
నెయ్యి - అరస్పూన్
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - 1 స్పూన్
నీరు - ఒకటిన్నర కప్పు
ఎండుమిర్చి - 4
వెల్లుల్లి రెబ్బలు - 6
జీలకర్ర, ఆవాలు - అరస్పూన్
 
తయారీ విధానం:
ముందుగా కుక్కర్ పాన్లో పప్పులన్నిటితోపాటు కరివేపాకు కూడా వేసి దోరగా వేయించి ఆ తరువాత ఉప్పు, పసుపు, మిరియాల పొడి, నీరు పోసి బాగా ఉడికించుకోవాలి. ఆపై నేతిలో ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలతో తిరగమోత పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పప్పు మిశ్రమంలో కలుపుకోవాలి. వేడివేడి అన్నంలోకి కరివేపాకు పప్పు ఎంతో రుచిగా ఉంటుంది.