శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (15:56 IST)

విటమిన్ డి కావాలంటే.. ఈ వంటకాన్ని తినండి..

చాలామందికి శరీరంలో విటమిన్స్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యమైనది విటమిన్ డి. ఈ విటమిన్ డి ఏ ఆహార పదార్థాల్లో ఉంటుంది. వాటిని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం..
 
నేటి తరుణంలో కాలుష్యం ఉండడం వలన ఇంట్లో, ఆఫీసు గదుల్లో అధిక సమయం గడపడం వలన విటమిన్ డి లోపం చాలామందిలో కనిపిస్తుంది. విటమిన్ డి ఉన్న ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు వైద్యులు. కొంత సమయం ఎండలో గడపడం వలన విటమిన్ డి లోపం లేకుండా చేసుకోవచ్చు. గుడ్డు పచ్చ సొన, చేపలు వంటి వాటిల్లో విటమిన్ డి అధికంగా ఉంటుంది. మరి విటమిన్ డి దొరికే రెసిపీని ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
ఆలివ్ నూనె - 2 స్పూన్స్
గుడ్లు - 2
దాల్చిన చెక్క పొడి - అరస్పూన్
చక్కెర - 2 స్పూన్స్
 
తయారీ విధానం:
ముందుగా బాణలిని వేడిచేసి ఆపై ఆలివ్ నూనె వేసి అందులో గుడ్డు పగలగొట్టి బాగా వేయించుకోవాలి. తరువాత అందులో దాల్చిన చెక్క పొడి, చక్కెర వేసి బాగా కలిసేలా మిక్స్ చేస్తే స్వీట్ ఎగ్ బుర్జి రెడీ. దీన్ని ఈవెనింగ్ స్నాక్స్‌గా తీసుకోవచ్చు. ఇష్టమైన వారు ఈ మిశ్రమంలో కొద్దిగా పాలు కలిపి తీసుకోవచ్చు.