బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (11:07 IST)

చిల్లీ బేబీకార్న్..?

కావలసిన పదార్థాలు:
బేబీ కార్స్ - పావుకేజీ
ఉల్లిపాయలు - 2 
ఉల్లికాడ తరుగు - పావుకప్పు
అల్లం వెల్లుల్లి తరుగు - 1 స్పూన్
సోయా సాస్ - స్పూన్
వెనిగర్ - 2 స్పూన్స్
కార్న్‌ఫ్లోర్ - 2 స్పూన్స్
బ్రౌన్ షుగర్ - అరస్పూన్
క్యాప్సికం - 1
టమోటా సాస్ - ఒకటిన్నర్ స్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ - 1 స్పూన్
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - పావుస్పూన్
 
తయారీ విధానం:
ముందుగా బేబీకార్న్‌ను అంగుళం ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిల్లో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరిగించిన స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ను బేబీకార్న్‌కు పట్టించి 10 నిమిషాలు పక్క పెట్టాలి. ఆ తరువాత బాణలిలో 2 స్పూన్స్ నూనె వేసి అందులో వీటిని వేసి అన్నివైపులా వేయించి తీసి పక్క పెట్టుకోవాలి. అదే బాణలిలో అల్లం, వెల్లుల్లి తరుగు వేయించి ఆపై ఉల్లి కాడల తరుగు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. అవి బాగా వేగిన తరువాత పచ్చిమిర్చి పేస్ట్, టమోటా, సోయా సాస్, వెనిగర్, చక్కెరతో పాటు వేయించిన బేబీకార్న్ కలిపి పెద్దమంటపై 1 నిమిషాల పాటు వేగించి పావుకప్పు నీరు పోయాలి. 2 నిమిషాల తరువాత మిగిలిన కార్న్‌ఫోర్ వేసి చిక్కబడ్డాక ఉల్లికాడలు చల్లి దించేయాలి. అంటే టేస్టీ టేస్టీ చిల్లీ బేబీకార్న్ రెడీ.