గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (11:09 IST)

పొంగడాలు తయారీ విధానం..?

కావలసిన పదార్థాలు:
ఇడ్లీ బియ్యం - అరకప్పు
ముడిబియ్యం - అరకప్పు
మినప్పప్పు - పావుకప్పు
మెంతులు - అరస్పూన్
ఉప్పు - తగినంత
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 4
కరివేపాకు - రెబ్బ
కొబ్బరి తురుము - 2 స్పూన్స్
సెనగపప్పు - 1 స్పూన్
ఆవాలు - 1 స్పూన్
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా బియ్యం, మినప్పప్పు, మెంతులు అన్నింటిని బాగా కడిగి విడివిడిగా గిన్నెల్లో వేసి గంటలపాటు నానబెట్టుకోవాలి. ఆ తరువాత అన్నీ కలిపి మెత్తగా రుబ్బి ఆపై ఉప్పు కలుపుకోవాలి. ఈ పిండిని కనీసం ఓ 10 గంటల పాటు పులియనివ్వాలి. ఆ తరువాత బాణలిలో నూనె వేసి ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు వేసి వేయించి ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొబ్బరి తురిమిన పిండిలో కలపాలి. ఇప్పుడు పొంగడాల పెనాన్ని స్టవ్‌మీద పెట్టి ఒక్కో గుంతలో రెండుమూడు చుక్కల నూనె వేసి పిండి మిశ్రమాన్ని వేసి మూతపెట్టి ఓ 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించాలి. ఆపై చెక్కస్పూనుతో నెమ్మదిగా రెండోవైపునకు తిప్పాలి. ఇలా రెండు వైపులా ఉడికించి తీసుకుంటే వేడి వేడి పొంగడాలు రెడీ.