బనానా ఖుల్ఫీ ఎలా చేయాలి..?

Last Updated: సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (11:03 IST)
కావలసిన పదార్థాలు:
పాలు - 1 లీటర్
చక్కెర - 5 స్పూన్స్
అరటి పండ్ల గుజ్జు - 3 స్పూన్స్
అరటి పండు ముక్కలు - కొన్ని

తయారీ విధానం:
ముందుగా అరటి పండును ఒలిచి ఫోర్క్‌తో మెత్తటి గుజ్జులా చేయాలి. ఆపై 1 స్పూన్ చక్కెరను నీళ్ళతో ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. తరువాత పాలు అడుగంటకుండా తిప్పుతూ నాలుగోవంతు చిక్కదనం వచ్చేవరకు ఉంచాలి. ఇప్పుడు చక్కెర కలిపి పూర్తిగా కరిగాక కిందికి దింపి చల్లార్చండి. తరువాత అందులో అరటి గుజ్జు కలిపి కప్పుల్లో గానీ, బౌల్స్‌లో గానీ పోసి ఫ్రీజర్‌లో పెట్టాలి. కాసేపటి తరువాత బయటకు తీసి పైన చెర్రీలు లేదా అరటి ముక్కలు వేసి తింటే.. ఎంతో టేస్టీగా ఉంటుంది.దీనిపై మరింత చదవండి :