మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By
Last Updated : శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (11:56 IST)

వేడి వేడి ఎగ్ బోండా.. ఎలా చేయాలి..?

కావలసిన పదార్థాలు:
గుడ్లు - 3 (ఉడికించినవి)
నూనె - 1 కప్పు
బియ్యం పిండి - అరకప్పు
కారం - అరస్పూన్
మిరియాల పొడి - కొద్దిగా
పచ్చిమిర్చి - 2
శెనగపిండి - 1 కప్పు
ఉప్పు - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా ఉడికించిన గుడ్లను రెండు ముక్కలుగా కట్ చేయాలి. ఆ తరువాత వాటిపై కొద్దిగా కారం, మిరియాల పొడి, ఉప్పు చల్లాలి. ఇప్పుడు సన్ననిమంటపై బాణలి పెట్టి నూనె పోసి వేడిచేయాలి. తరువాత శెనగపిండి, బియ్యం పిండి, కారం, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, ఉప్పును ఒక బౌల్‌లో వేసి నీళ్లు పోసి బజ్జీలకు సరిపడేలా పిండిని తయారుచేసుకోవాలి. 
 
నూనె బాగా వేడెక్కిన తరువాత ఉడికిన కోడిగుడ్డు ముక్కలను రెడీ చేసిపెట్టుకున్న శెనగపిండి మిశ్రమంలో ముంచి బంగారు రంగులో వచ్చేవరకు వేగించాలి. ఇవి నూనెను ఎక్కువ పీల్చినట్టు అనిపిస్తే టిష్యూ పేపర్‌లో ఉంచితే నూనెను పీల్చేస్తాయి. అంతే వేడివేడి ఎగ్ బోండా రెడీ.