శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By
Last Updated : శనివారం, 9 ఫిబ్రవరి 2019 (11:20 IST)

కొత్తిమీర లెమన్ సూప్..?

కావలసిన పదార్థాలు:
సన్నగా తరిగిన కొత్తిమీర - 2 స్పూన్స్
ఉల్లిపాయ - 1
వెల్లుల్లిపాయ - 1
నిమ్మరసం - 2 స్పూన్స్
వెజిటేబుల్ స్టాక్ - 4 కప్పులు
మిరియాల పొడి - కొద్దిగా
ఉప్పు - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా ఉల్లిపాయ, ఉల్లికాడ, అల్లం, వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. అందులో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, ఉల్లికాడ ముక్కలు అన్నింటినీ వేసి మీడియం మంట మీద వేయించుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నీ మెత్తగా అయ్యేవరకు వేయించి, అందులో వెజిటేబుల్ స్టాక్ పోసి బాగా ఉడికించాలి. తర్వాత కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. సూప్ చిక్కగా మారే సమయంలో స్టవ్ ఆఫ్ చేసేయాలి. బట్టర్‌తో గార్నిష్ చేసుకుని, వేడివేడిగా సర్వ్ చేయాలి. అంతే కొత్తిమీర లెమన్ సూప్ రెడీ.