ఘుమఘుమలాడే బీరకాయ రొయ్యల కూర ఎలా చేయాలి..?
కావలసిన పదార్థాలు:
బీరకాయలు - 2
రొయ్యలు - 400 గ్రా
నూనె - తగినంత
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 4
కరివేపాకు - 4 రెబ్బలు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
కారం - ఒకటిన్నర స్పూన్
గరం మసాల పొడి - అరస్పూన్
ఉప్పు - తగినంత
కొత్తిమీర తరుగు - గుప్పెడు
ధనియాలు పొడి - అరస్పూన్
పసుపు పొడి - కొద్దిగా
జీరా - అరస్పూన్
తయారీ విధానం:
ముందుగా రొయ్యలను బాగా శుభ్రం చేసుకోవాలి. ఆపై అందులో 1 స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, ధనియా, జీరా, పసుపు పొడులు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత కొద్దిగా నూనెలో నీరంతా ఆవిరయ్యేవరకు చిన్నమంటపై వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మరికొంత నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు బీర ముక్కలు, ఉప్పు కలిపి ఉడికించుకోవాలి. కాసేపటి తరువాత రొయ్యలతో పాటు పావుకప్పు నీరు పోసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి. అంటే ఘుమఘుమలాడే బీరకాయ రొయ్యల కూర రెడీ.