రొయ్యల టిక్కా..? అబ్బ... ఎంత టేస్టో...
కావలసిన పదార్థాలు:
రొయ్యలు - ముప్పావు కేజీ
కొత్తిమీర తరుగు - 2 స్పూన్స్
నిమ్మరసం - 2 స్పూన్స్
పెరుగు - పావుకప్పు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర స్పూన్
నూనె - 1 స్పూన్
కారం - పావుస్పూన్
ఉప్పు - తగినంత
మొక్కజొన్నపిండి - పావుకప్పు
తయారీ విధానం:
ముందుగా రొయ్యల్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత వీటిలో మొక్కజొన్న పిండి తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని వేసి బాగా కలుపుకోవాలి. 20 నిమిషాల తరువాత ఈ రొయ్యల మిశ్రమంలో మొక్కజొన్న పిండి వేసి మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు రొయ్యల్ని ఇనుప చువ్వలకు గుచ్చి.. నిప్పులపై లేదా గ్రిల్ పద్ధతిలో ఓవెన్‌లో కాల్చుకోవాలి. అంతే... ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రొయ్యల టిక్కా రెడీ.