ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : గురువారం, 3 జనవరి 2019 (11:52 IST)

ఆపిల్ పాన్ కేక్ తయారీ విధానం..?

కావలసిన పదార్థాలు:
గోధుమ పిండి - అరకప్పు
మైదా - అరకప్పు
బేకింగ్ పౌడర్ - 2 స్పూన్స్
ఆపిల్ - 1
పాలు - 3 కప్పులు
దాల్చిన చెక్క పొడి - 1 స్పూన్
పంచదార - 1 స్పూన్
ఉప్పు - చిటికెడు
నూనె - 1 స్పూన్
 
తయారీ విధానం:
ముందుగా ఒక వెడల్పాటి పాత్రలో గోధుమపిండి, మైదా, బేకింగ్ పౌడర్, పంచదార కలపాలి. అందులోనే తురిమిన ఆపిల్ గుజ్జు, దాల్చిన చెక్క పొడి, పాలు, నూనె కూడా వేసి ఉండలు లేకుండా జారుగా కలిపి 10 నిమిషాల పక్కనుంచాలి. తరువాత నాన్ స్టిక్ పెనం పై అరకప్పు చొప్పున పోస్తూ సన్నని మంటపై రెండువైపులా దోరగా కాల్చి తీసేయాలి. వీటిని తేనెలో అద్దుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.