బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 30 డిశెంబరు 2018 (15:38 IST)

నేను పెళ్లి చేసుకోను.. వదంతులు ఆపండి.. వరలక్ష్మి

సర్కార్, పందెంకోడి 2, మారి 2, మిస్టర్‌ చంద్రమౌళి వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చారు వరలక్ష్మి. తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి వార్తలపై కోలీవుడ్‌లో పెద్ద చర్చే సాగుతోంది. విశాల్‌తో ప్రేమలో వుందని.. ఆయన్ని పెళ్లి చేసుకోబోతుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్న నేపథ్యంలో.. తాజా ఇంటర్వ్యూలో పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదని తేల్చేసింది. 
 
అయినా వరలక్ష్మి పెళ్లి గురించి చర్చలు మాత్రం ఆగలేదు. తాజాగా వరలక్ష్మి తన పెళ్లి గురించి నోరు విప్పింది. తాను పెళ్లి చేసుకోవట్లేదని తేల్చేసింది. తన పెళ్లి గురించిన వార్తలు ఎవరు సృష్టిస్తున్నారన్న విషయం తనకు తెలుసని తెలిపింది.
 
ఏడాది చివర్లో ఎవరో పనీపాట లేకుండా తన పెళ్లి గురించి వదంతులు సృష్టిస్తున్నారని తెలిపింది. తమిళ ఇండస్ట్రీలోనే వుంటానని.. నటన పరంగా గుర్తింపు తెచ్చుకుంటానని స్పష్టం చేసింది. ఇలాంటి వదంతలు సృష్టించేవారికి తగిన బుద్ధి చెప్తానని వరలక్ష్మీ క్లారిటీ ఇచ్చేసింది.