శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 30 డిశెంబరు 2018 (12:40 IST)

వరుడు పరార్.. చివరి క్షణాల్లో వధువు పెళ్లాడిన యువకుడు..

పెళ్లికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలివున్న నేపథ్యంలో మండపానికి వెళ్తూ వెళ్తూ పెళ్లికొడుకు పారిపోయాడు. అంతే ఆ పెళ్లి రద్దు అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ వధువును పెళ్లి చేసుకునేందుకు ఓ యువకుడు ముందుకు వచ్చాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. పొట్లపల్లి గ్రామానికి చెందిన కోల రాజలింగు కుమార్తెకు పందిపెల్లి శ్రీనివాస్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. డిసెంబర్ 29వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేశారు. కానీ పెళ్లి మండపానికి వాహనంలో వెళ్తూ వెళ్తూ వరుడు పారిపోయాడు.

శ్రీనివాస్ మరో యువతిని ప్రేమిస్తున్నానని చెప్పినా.. పెద్దలు బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నారు. కానీ వరుడు పారిపోవజంతో.. వధువును రమేష్ అనే అబ్బాయి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకు వధువు, రమేష్ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో... వీరి వివాహం అట్టహాసంగా జరిగింది.