గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (12:14 IST)

భోజనంలో మొదటి ముద్దను అలా తీసుకుంటే..?

మధుమేహాన్ని నియంత్రించుకోవాలంటే.. కరివేపాకు పొడిని భోజనంలో మొదటి ముద్ద కలుపుకుని తినాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కరివేపాకు పొడి మదుమేహాన్ని నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గిస్తుంది. అందుకే కరివేపాకు పొడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే నేరేడు గింజల చూర్ణాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో దాన్ని కలిపి నిత్యం ఉదయం, సాయంత్రం పూట తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. వీటితో పాటు మునగాకు పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని గ్లాసుడు నీటిలో కలిపి ఉదయం పరగడుపున సేవిస్తే మధుమేహం సమస్య ఉత్పన్నం కాదు. 
 
అంతేగాకుండా.. ఒక రాగి పాత్రలో నీటిని పోసి అందులో గుప్పెడు తులసి ఆకులు వేయాలి. ఆ నీటిని రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే తాగేయాలి. ఫలితంగా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.