గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (09:23 IST)

పైనాపిల్ తొక్కలను నూనెలో వేయించి తీసుకుంటే..?

ఈ సీజన్‌లో పైనాపిల్ అధికంగా దొరుకుతుంది. పైనాపిల్ అంటే ఇష్టపడని వారుండరు. ఇప్పుడు ఎక్కడ చూసినా దీనినే అమ్ముతున్నారు. పైనాపిల్ తీసుకునే వారిలో అనారోగ్య సమస్యలు దరిచేరవని ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు. తరచు పైనాపిన్ తీసుకుంటే.. కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం... 
 
1. పైనాపిల్‌లో మాంగనీస్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. ఒక కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే ఒక రోజుకు కావలసిన ఎనర్జీని అందుతుంది. దాంతో పాటు అలసట, ఒత్తిడి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
 
2. కొందరైతే బరువు తగ్గాలని ఏవేవో మందులు, మాత్రలు వాడుతుంటారు. కానీ, కాస్త కూడా బరువు తగ్గరు. అలాంటివారికి పైనాపిల్ మంచి టానిక్‌లా పనిచేస్తుంది. ఎలాగంటే.. కప్పు పైనాపిల్ ముక్కలను తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, కారం కలిపి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. బరువు కూడా తగ్గుతారు. 
 
3. పైనాపిల్ తొక్కలను బాగా ఎండబెట్టుకుని ఆపై నూనెలో ఈ తొక్కలను, 2 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, 1 టమోటా వేసి బాగా వేయించుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని కాస్త కచ్చాపచ్చాగా నూరి అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని ప్రతిరోజూ అన్నంలో కలిపి తీసుకుంటే.. ఆకలిని అరికట్టవచ్చును.
 
4. పైనాపిల్‌ను జ్యూస్ రూపంలో తీసుకుంటే కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ మధ్యాహ్న సమయంతో కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుని అందులో ఉప్పు, మిరియాల పొడి కలిపి తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి అంతగా వేయదు. ఇలా చేస్తే బరువు త్వరగా తగ్గుతారు.
 
5. పైనాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, న్యూట్రియన్స్ వంటి ఖనిజాలు అధికంగా ఉన్నాయి. ఇవి పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. దాంతో వీర్యవృద్ధికి ఎంతగానో దోహదపడుతాయి.