శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సిహెచ్
Last Modified: గురువారం, 24 జనవరి 2019 (18:00 IST)

రాగి పాత్రలలో మంచినీటిని తాగితే ఏమవుతుంది?

ప్రస్తుత కాలంలో అందరూ వాటర్ ప్యూరిఫయ్యర్‌లకు అలవాటు పడి రకరకాల ఫిల్టర్స్‌ను ఉపయోగిస్తున్నారు. నీటిని ప్లాస్టిక్ బాటిల్స్‌లో నిల్వ చేసుకొని త్రాగడం వలన రకరకాల అనారోగ్యాలకు గురి అవుతున్నారు. పూర్వకాలంలో అందరూ నీటిని రాగి పాత్రలలోను, రాగి చెంబులలోను తాగడం వలన వారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కనుక మనం వెనుకటి వారిలా ఆ రాగి పాత్రలను ఉపయోగించడం వలన ఎంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని ఉదయాన్నే తాగడం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం కూడా చెబుతోంది.
 
రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. రాగి పాత్రల్లో నీటిని నిల్వ ఉంచడం వల్ల అది సహజంగానే శుద్ధి అవుతుంది. నీటిలోని సూక్ష్మజీవులు నాశనం అవుతాయి. అది ఎలాగో చూద్దాం. 
 
1. రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని ఉదయాన్నే తాగడం వలన శరీరంలోని కఫ, వాత, పిత్త దోషాలను బ్యాలెన్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. శరీరంలోని వివిధ అవయవాల పనితీరు మెరుగుపడేందుకు కూడా ఇది సహకరిస్తుంది. 
 
2. రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది. అల్సర్లు తగ్గడానికి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవడానికి ఇది సహకరిస్తుంది. కాలేయం, కిడ్నీల పనితీరు మెరుగవుతుంది. ఆహారంగా తీసుకున్న పోషకాలు శరీరానికి అందుతాయి. 
 
3. వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం ప్రయోజనకరం. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి, జీర్ణక్రియ పనితీరు మెరగుపడటానికి రాగి పాత్రలోని నిల్వ ఉంచిన నీటిని తాగడం ఉపకరిస్తుంది. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల తనకు అవసరమైన వాటిని మాత్రమే ఉంచుకొని మిగతా వాటిని శరీరం బయటకు పంపుతుంది.
 
4. గాయాలు త్వరగా మానడానికి కూడా ఇది ఉపకరిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, కొత్త కణాల ఉత్పత్తికి రాగి దోహదం చేస్తుంది. శరీరంలో లోపల, ముఖ్యంగా కడుపులో ఏర్పడిన పుండ్లను మాన్పడానికి రాగి సహకరిస్తుంది.  వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి, రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి రాగి్ పాత్రలో నిల్వ ఉంచిన నీరు సహాయపడుతుంది.
 
4. వృద్ధాప్య ఛాయలను దరిచేరకుండా చేస్తుంది.
 
5. క్యాన్సర్ వచ్చే ముప్పును కూడా ఇది తగ్గిస్తుంది. ఇందులోని యాంటి ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలతో పోరాడుతాయి. 
 
6. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండటంతోపాటు, థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగపడుతుంది. 
 
7. ఆర్థరైటిస్ రాకుండా, కీళ్ల నొప్పుల బారిన పడకుండానూ ఇది కాపాడుతుంది. 
 
8. చర్మ వ్యాధుల బారిన పడకుండా, రక్తహీనత తగ్గడానికి ఈ అలవాటు ఉపకరిస్తుంది.