గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 1 డిశెంబరు 2018 (21:12 IST)

గింజ పట్టని లేత నల్లతుమ్మ కాయలను ఎండించి చూర్ణం చేసి పురుషులు తీసుకుంటే?

సాధారణంగా మం ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్యుని సంప్రదించి మందులు వాడుతుంటాము. అప్పటికి ఆ సమస్యకు ఉపశమనం కలిగినా మరలా కొంతకాలానికి ఆ సమస్య తలెత్తవచ్చు. అంతేకాకుండా ఎక్కువగా మందులు వాడటం వల్ల వేరే రకమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు. అలాకాకుండా ఉండాలంటే  మనకు ప్రకృతిలో సహజసిద్దంగా దొరికే వాటిని మందులాగా తయారుచేసుకుని వాడడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. అలాంటి వాటిల్లో నల్లతుమ్మ మన ఆరోగ్య సమస్యలకు అద్బుతమైన ఔషదంలా పని చేస్తుంది. అవేంటో చూద్దాం.
 
1. ఎండిన నల్ల తుమ్మకాయలు, బెరడు, బంక ఈ మూడింటిని సమంగా కలిపి చూర్ణం చేసుకుని స్పూన్ మోతాదులో రోజూ రెండు పూటలా తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. నడుముకు శక్తి, బలం కలుగుతుంది.
 
2. పూటకు పావు కప్పు లేత నల్లతుమ్మ ఆకుల రసాన్ని మూడు పూటలా సేవిస్తే బహిష్టు సమయంలో వచ్చే నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చును.
 
3. గింజ పట్టని లేత కాయలను నీడన ఎండించి చూర్ణం చేసుకోవాలి. ఆ చూర్ణానికి సమానంగా ఖండశర్కర పొడి కలిపి పూటకు రెండు స్పూన్స్ చొప్పున నీటితో సేవిస్తూ ఉంటే పురుషులకు బాగా ఉపయోగపడుతుంది.
 
4. నల్లతుమ్మ చెట్టు బెరడు కషాయాన్ని పుక్కిలించినా లేదా ఈ చెట్టు నుండి తీసిన చిన్న బంక ముక్కను నోట్లో ఉంచుకున్నా నోటిలోని అల్సర్లు మానిపోతాయి.
 
5. అరతులం బంక చూర్ణాన్ని అరకప్పు ఆవుపాలలో కలిపి రెండు పూటలు తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుకుతాయి. నల్లతుమ్మ చెట్టు కాయల చూర్ణం తీసుకున్నా ఇదే ప్రయోజనం కలుగుతుంది.