1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Amazing health benefits for men with Green Camphor

పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి చూర్ణాలతో పురుషులకు ఆ పవర్...

కర్పూరం అనగానే దేవుడికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తాము. కర్పూరాన్ని పూజా ద్రవ్యంగా భావించి వెలిగించడం మనకు ఎప్పటినుండో వస్తున్న ఆచారమైనప్పటికీ, తద్వారా క్రిమికీటకాదులు దరిచేరవన్నది ఆ ఆచారం వెనుక దాగిఉన్న వైజ్ఞానిక శాస్త్రం. కర్పూరం కేవలం పూజాద్రవ్యమే

Amazing health benefits
కర్పూరం అనగానే దేవుడికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తాము. కర్పూరాన్ని పూజా ద్రవ్యంగా భావించి వెలిగించడం మనకు ఎప్పటినుండో వస్తున్న ఆచారమైనప్పటికీ, తద్వారా క్రిమికీటకాదులు దరిచేరవన్నది ఆ ఆచారం వెనుక దాగిఉన్న వైజ్ఞానిక శాస్త్రం. కర్పూరం కేవలం పూజాద్రవ్యమే కాదు. ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించే మహత్తర శక్తివంతమైన ఔషధ గుణాలను నిక్షిప్తం చేసుకుని, పలురకాల అనారోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం చూపే ఆరోగ్యప్రదాత కూడా. ప్రస్తుత కాలంలో పురుషులను ఎక్కువగా వేధించే సమస్య అంగస్తంభన, శీఘ్రస్ఖలనం. ఈ సమస్యకు కర్పూరం అద్భుతంగా పని చేస్తుంది. అదెలాగో చూద్దాం.
 
1. ఆవనూనెను వేడిచేసి, నాలుగవ వంతు కర్పూరాన్ని అందులో కరిగించి చల్లార్చి నిలువ ఉంచుకుని, తొడలు, ఉదరం మొదలైన భాగాల్లో మర్దనా చేస్తుంటే ఆయా భాగాల్లో సంచితమైన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది. రొమ్ములపై గడ్డలున్న చోట మర్దనా చేస్తుంటే కొన్ని విధాలైనా గడ్డలు కరిగిపోతాయి.
 
2. పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని తగినంత ఎండుద్రాక్ష కలిపి నూరి సెనగలంత మాత్రలు చేసుకుని రాత్రి నిద్రకు ముందు ఒక మాత్ర చొప్పున కప్పు పాలతో సేవిస్తుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం, అంగస్తంభన సమస్య తగ్గి శృంగార సామర్థ్యం పెరిగి, దాంపత్య సమయంలో సంతృప్తి కలగడమే కాకుండా సంభోగం తరువాత నీరసం లేకుండా ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
 
3. అరగ్లాసు కాచి చల్లార్చిన నీటిలో చిటికెడు పంచదార, చిటికెడు కర్పూరం, చిటికెడు ఉప్పు కలిపి రెండు గంటలకు ఒకసారి సేవిస్తుంటే నీళ్ల విరేచనాలు, కలరా వ్యాధి తగ్గుతాయి. అంతేకాకుండా నీరసం, నిస్త్రాణం కూడా తగ్గుతాయి.
 
4. పాదాలు, అరచేతుల చర్మం బిరుసెక్కి పగుళ్లతో బాధపడేవారు, కొబ్బరినూనెలో పసుపు, కర్పూరం కలిపి రంగరించి రాస్తుంటే చక్కటి ఫలితం ఉంటుంది.
 
5. మిరియాలు, కర్పూరం, నల్లజీలకర్ర పొడి, ఏలుకల చూర్ణాలను సమానంగా కలిపి ముక్కుపొడుంలా పీలుస్తుంటే, ముక్కు, సైనస్ తదితర భాగాల్లో సంచితమైన శ్లేష్మమంతా సులువుగా బయటకు వెళ్లి ముక్కుదిబ్బడ, తలబరువు, తలనొప్పి వంటి బాధలు తగ్గుతాయి.
తర్వాతి కథనం
మెులకలతో రక్తహీనతకు చెక్ పెట్టేయవచ్చు... ఇంకా చాలా వున్నాయండోయ్...