గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By
Last Updated : ఆదివారం, 27 జనవరి 2019 (18:26 IST)

చలికాలం.. చింత చిగురుతో చేపలు కూర.. టేస్ట్ చేస్తే?

చేపలు చలికాలంలో తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి రుగ్మతలను దూరం చేసుకోవాలంటే.. చేపలు వారానికి రెండు సార్లైనా డైట్‌లో చేర్చుకోవాలి. ఇంకా చింతచిగురును వంటల్లో లేదా పచ్చడి రూపంలో తీసుకుంటే.. చలికాలంలో శరీరానికి కావలసిన వేడి లభిస్తుంది. అలాంటి చింత చిగురుతో చేపల కూర ఎలా చేయాలో చూద్దాం..
 
చేపలు- అరకేజీ 
చింతపండు-పావు కప్పు
ఉల్లి తరుగు - అర కప్పు 
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూన్ 
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్‌
కొత్తిమీర తరుగు - ఒక స్పూన్ 
గరంమసాలా- అరస్పూన్‌,
మిరప పొడి, ఉప్పు- తగినంత 
పోపు దినుసులు - కావలసినంత
పసుపు- తగినంత
నూనె- సరిపడా
 
తయారీ విధానం..
ముందుగా పసుపు పొడి వేసి బాగా శుభ్రం చేసిన చేప ముక్కలను ఆవిరిపై ఉడికించుకోవాలి. తర్వాత ముల్లులు తీసేసి పక్కనబెట్టుకోవాలి. తర్వాత ఓ పాత్రలో నూనె వేసి వేడయ్యాక... పోపు దినుసులు వేసి.. తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని దోరగా వేపుకోవాలి. 
 
బాగా వేగిన తర్వాత.. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, పసుపు అందులో చింత చిగురు పోసి మిరపపొడి, ఉప్పు వేసి కలియబెట్టాలి. చింతపండు పులుసు మరుగుతున్న సమయంలో చేప ముక్కలను వేసుకుని ఉడికించుకోవాలి. తర్వాత గరంమసాలా, బెల్లం పొడి వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర, కరివేపాకు తరుగు చేర్చి దించేయాలి.