శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (12:19 IST)

ఉప్పు లేకుండా నిమ్మకాయ రసంతో చేపల కూర.. మిస్టర్ సి కోసం

తన భర్త, టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్‌ పట్ల భార్య ఉపాసన కొణిదెల చూపించే శ్రద్ధ అంతాఇంతా కాదు. వారిద్దరి మధ్య ఉండే ప్రేమానురాగాలు ఇతరులకు ఈర్ష్య కలిగించేలా ఉంటాయి. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. 
 
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం "వినయ విధేయ రామ". ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి చెర్రీ రేయింబవుళ్లు శ్రమించాడు. ఫలితంగా ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకానుంది. ఈనెల 11వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. 
 
అదేసమయంలో చెర్రీ తాను తీసుకునే ఆహారం విషయంలో పక్కాగా ఉంటారు. ఈ విషయాన్ని ఉపాసన పలుమార్లు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది కూడా. హార్డ్ వ‌ర్క్‌, డెడికేష‌న్‌, డిసిప్లైన్ ఉంటే ఫిట్‌గా, హెల్తీగా ఉండొచ్చని మీరు ఈ డైట్ పాటించ‌డ‌ని రామ్ చ‌ర‌ణ్ డైట్‌కి సంబంధించిన లిస్ట్ షేర్ చేసింది. 
 
ఇక తాజాగా త‌న భ‌ర్త కోసం చేసిన వంట‌కానికి సంబంధించిన వీడియోని షేర్ చేసింది. లొకేష‌న్ దగ్గ‌ర‌లో ఉన్న స‌ర‌స్సులోంచి చేప‌ని అసిస్టెంట్‌తో తెప్పించిన ఉపాస‌న డిష్‌ని కారం, ఉప్పు లేకుండా ఆలీవ్‌ ఆయిల్‌, నిమ్మకాయను క‌లిపి వంట చేసింది. స్వీట్ పొటాటో లేకపోయేసరికి దాని బదులు ఆలుగ‌డ్డ‌ని ఉడకబెట్టి ఇచ్చారట‌. భ‌ర్త విష‌యంలో ఉపాస‌న చూపించే శ్ర‌ద్ధ‌ని చూసి అభిమానులు మురిసి పోతున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతుంది.