ఓ చేతిలో టీ, మరో చేతిలో సమోసాలు... ఉపాసనపై ఆ ప్రభావం బాగా పడినట్లుంది...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్‌గా ఉంటుంటారు. రామ్ చరణ్ గురించి.. సమాజంలో జరుగుతున్న విషయాల గురించి సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాల్ని తెలియచేస్తుంటారు. ఇదిలా ఉంటే.. గత రెండుమూడు రోజుల నుంచి హైదరాబాద్‌లో చలి ఎలా ఉందో తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన పెథాయ్ తుఫాన్ ప్రభావం వలన హైదరాబాద్‌లో చలి జనాన్ని గజగజ వణికిస్తుంది. అందుకనే అనుకుంట సోషల్ మీడియాలో ఉపాసన కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. ఆ ఫోటోల్లో... ఓ చేతిలో టీ, ఓ చేతిలో సమోసా పట్టుకుని... ఇప్పుడు హైదరాబాద్ వాతావరణానికి ఏది బెటర్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటో పోస్ట్ చేయడాన్ని బట్టి చూస్తుంటే... ఉపాసనపై ఈ చలి ప్రభావం బాగా పడినట్టు కనిపిస్తుంది.