మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: బుధవారం, 19 డిశెంబరు 2018 (14:44 IST)

ఆ కంపెనీ యజమానులు వేధిస్తున్నారు... యువకుడు ఆత్మహత్య

హైదరాబాద్ లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరుధిలోని సియమ్‌యెస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగం చేస్తున్న నూతలగంటి నర్సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడి వయసు 30 సంవత్సరాలు.
 
తన చావుకి కారణం యాజమాన్యం వేధింపులేనంటూ ఓ లేఖ రాసి పెట్టాడు. పొద్దస్తమానం తనను వారు వేధిస్తున్నారనీ, వాటిని భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీనితో 
 
లోయర్ ట్యాంక్ బ్యాండ్‌లోని కార్యాలయం ఎదుట అతడి మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.