శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 27 నవంబరు 2018 (13:41 IST)

ఈజిప్టులో సందడి చేసిన నారా బ్రాహ్మణి, కొణిదెల ఉపాసన

బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి, చిరంజీవి కోడలు కొణిదెల ఉపాసన కలిసి ఈజిప్టులో సందడి చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈజిప్టులో ఫేమస్ పిరమిడ్‌గా పేరొందిన గిజా పిరమిడ్ వద్ద తమ స్నేహితులతో కలిసి ఉపాసన, బ్రాహ్మణి సందడి చేశారు. 
 
చుట్టుప్రక్కల ఉన్న పలు చారిత్రిక ప్రదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేశారు.
 గురు, శుక్ర, శనివారం ఈజిప్టులో తిరిగి చరిత్రకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం, చర్చించుకున్నాం అని పేర్కొంటూ ఆ పిక్స్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది ఉపాసన. బేసికల్‌గా ఉపాసన, బ్రాహ్మణిలు మంచి స్నేహితులు కూడా. దీంతో ఇద్దరూ ఇలా సరదాగా పర్యాటక ప్రదేశాల్లో గడపటం చూసి ముచ్చటపడుతున్నారు నందమూరి, మెగా అభిమానులు.