శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 25 అక్టోబరు 2018 (13:47 IST)

శక్తివంతమైన మహిళల్లో బ్రహ్మిణి ఒకరు: మంచు మనోజ్

నారా బ్రాహ్మణిపై హీరో మంచు మనోజ్  ట్విట్లర్లో ప్రశంసల వర్షం కురిపించారు. సింహం కడుపున సింహమే పుడుతుందని జై బాలయ్య అంటూ ట్వీట్ చేశాడు. వివరాల్లోకి వెళితే తిత్లీ తుఫాన్ ప్రభావం కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాకు హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌‌గా ఉన్న నారా  బ్రాహ్మణి రూ.66 లక్షల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేయడంతో పాటు, శ్రీకాకుళం జిల్లాలోని తుఫాన్ ప్రభావిత గ్రామాలను దత్తత  తీసుకుంటామని నారా బ్రహ్మణి తెలియజేశారు.
 
దీనిపై నారా బ్రహ్మిణిని ట్విట్టర్ ద్వారా మంచు మనోజ్ అభినందించాడు. ‘శ్రీకాకుళం కోసం ఆమె తీసుకున్న నిర్ణయం నిజంగా స్ఫూర్తిదాయకం. నాకు తెలిసిన శక్తివంతమైన స్త్రీలలో ఈమె ఒకరు. బ్రాహ్మణి తీసుకున్న గొప్ప నిర్ణయం ఇది. బాధితులకు అండగా ఇంతమంది నిలబడటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని తెలియజేశాడు మంచు మనోజ్.