సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: సోమవారం, 22 అక్టోబరు 2018 (13:01 IST)

రాయలసీమ వస్తున్నా... రాగి సంగటి - మటన్ పులుసు రెడీగా పెట్టండి... మంచు మ‌నోజ్

యువ హీరో మంచు మ‌నోజ్ వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో అల‌రించి.. న‌టుడుగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే.. ఈమ‌ధ్య కాలంలో స‌రైన స‌క్స‌స్ రాక కెరీర్లో బాగా వెన‌క‌బ‌డ్డాడు. త్వ‌ర‌లో కొత్త సినిమా ఎనౌన్స్ చేస్తాడు అనుకున్నారు కానీ.. అంద‌రికీ షాక్ ఇచ్చాడు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. సినిమాలే ప్రపంచం కాదంటూ.. తనకు చేతనైన సహాయం చేయాల‌నుకుంటున్న‌ట్టు తెలియ‌చేస్తూ ఓ లేఖను ట్విట్ట‌ర్లో పోస్ట్ చేసి వార్త‌ల్లో నిలిచాడు.
 
ఇంత‌కీ ఆ లేఖ‌లో ఏం ఉందంటే... తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశం తిరుపతి అని, అక్కడి అణువణువు దైవత్వంతో నిండి ఉందంటూ.. తను ప్రారంభించబోయే సహాయ కార్యక్రమాలు రాయలసీమ నుంచే మొదలుపెడతానని.. త‌న సేవా కార్య‌క్ర‌మాలు తిరుప‌తికే ప‌రిమితం చేయ‌కుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో కూడా చేయ‌నున్న‌ట్టు తెలియ‌చేసాడు. 
 
రైతుల‌కు, పిల్ల‌లు విద్య‌ను పొంద‌డంలో స‌హాయం చేస్తాన‌ని చెప్పాడు. తిరుప‌తి నుంచి ప్రారంభ‌మ‌య్యే ఈ స‌హాయం ప్ర‌పంచం అంతా చేరువ అయ్యేలా త‌పిస్తాను. ముందుగా ఇక్క‌డి యువ‌త‌కు స‌హాయ‌ప‌డేలా ఏదైనా చేస్తాను. నా వ‌ల్ల ఈ లోకానికి క‌లిగే ప్ర‌యోజ‌నం ఏంటో వెతికే క్ర‌మంలో కొన్ని నెల‌లు నిమిత్తం తిరుప‌తి షిప్ట్ అవుతున్నాను అని తెలియ‌చేసాడు.
 
అంతేకాకుండా చివ‌ర‌లో రాయ‌ల‌సీమ వ‌స్తున్న‌ా.. రాగి సంగ‌టి.. మ‌ట‌న్ పులుసు రెడీగా పెట్టండి అన్నాడు. మ‌నోజ్ నుంచి ఊహించ‌ని ఈ ట్వీట్‌తో మ‌నోజ్ రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం క‌న్ఫ‌ర్మ్ అని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి.. ఇదే నిజ‌మైతే క‌నుక మ‌నోజ్ ఏ పార్టీలో చేర‌తారో..? చూడాలి.