ఆ విషయం బ్రహ్మీకే వదిలేస్తున్నా- అమ్మ, బ్రహ్మి సంపాదిస్తే?: నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ న్యూజెర్సీలో ఎన్నారైలతో సమావేశం సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళా ఎన్నారై అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు కోడలు, బాలయ్య క
ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ న్యూజెర్సీలో ఎన్నారైలతో సమావేశం సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళా ఎన్నారై అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు కోడలు, బాలయ్య కుమార్తె, నారా లోకేష్ సతీమణి అయిన నారా బ్రాహ్మణి రాజకీయాల్లో వస్తారా? రాజకీయాల్లో నిర్మలా సీతారామన్ తరహాలో రాణిస్తారా అనే ప్రశ్నకు నారాలోకేష్ స్పందించారు.
తనకు రాజకీయాల్లో వచ్చేందుకు ఆప్షన్ వుంది కాబట్టి వచ్చానని, అదే తరహాలో బ్రాహ్మి కూడా రాజకీయాల్లో రావొచ్చునని.. అయితే నిర్ణయం ఆమెదేనన్నారు. ఇంట్లో మహిళా సాధికారత పూర్తిగా వుందని.. అమ్మ, బ్రహ్మి సంపాదిస్తుంటే.. తాను, నాన్న ఖర్చు పెడుతూ వుంటామని.. తన క్రిడిట్ కార్డు బిల్లులు కూడా బ్రహ్మినే కడుతుంటుందని చెప్పారు. అయితే ఎన్నారైల తరపున బ్రహ్మి రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నారనే విషయాన్ని ఆమెకు తెలియజేస్తానని నారా లోకేష్ తెలిపారు.