ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2018 (13:10 IST)

రాజకీయాలంటే రెండున్నర గంటల సినిమా కాదు : జయప్రద కామెంట్

రాజకీయాలంటే రెండున్నర గంటల సినిమా కాదనీ సినీనటి జయప్రద అన్నారు. తమిళ నటులు రజనీకాంత్, కమల్ హాసన్‌లు రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న విషయం తెల్సిందే. వీరి నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయాలంటే రెండున్నర గంటల సినిమా కాదనీ సినీనటి జయప్రద అన్నారు. తమిళ నటులు రజనీకాంత్, కమల్ హాసన్‌లు రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న విషయం తెల్సిందే. వీరి నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఈనేపథ్యంలో జయప్రద స్పందిస్తూ, రాజకీయాలంటే రెండున్నర గంటల సినిమా ఏమీ కాదని, రాణించడం చాలా కష్టమన్నారు. వీరిద్దరూ నడవాలని భావిస్తున్న దారి పూలదారేమీ కాదన్నారు. ఎన్నో ముళ్లు, రాళ్లతో నిండిన క్లిష్టమైన మార్గాన్ని వారు ఎంచుకుంటున్నారని, జాగ్రత్తగా చూసి అడుగు వేయాలని సూచించారు.
 
సినిమాలకు, రాజకీయాలకూ ఏ మాత్రం సంబంధం ఉండదన్నారు. వీరిద్దరి రాజకీయ ప్రవేశాన్ని తాను స్వాగతిస్తున్నానని, జయలలిత మరణంతో తమిళనాట ఏర్పడిన రాజకీయ శూన్యతను వీరు తొలగించే అవకాశాలు ఉన్నాయన్నారు. వీరిలో ఎవరు రాణిస్తారన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని జయప్రద వ్యాఖ్యానించారు.