రజనీ నాన్ లోకల్.. కమల్, రజనీ లాంటి వాళ్లు?: భారతీ రాజా
ప్రముఖ దర్శకుడు భారతీరాజా సూపర్ స్టార్ రజనీకాంత్‌పై విరుచుకుపడ్డారు. రజనీకాంత్ నాన్ లోకల్ అన్నారు. విశ్వాస ఘాతుకానికి రజనీకాంత్ నిలువెత్తు నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళ వ్యక్తులు కాని వారు రా
ప్రముఖ దర్శకుడు భారతీరాజా సూపర్ స్టార్ రజనీకాంత్‌పై విరుచుకుపడ్డారు. రజనీకాంత్ నాన్ లోకల్ అన్నారు. విశ్వాస ఘాతుకానికి రజనీకాంత్ నిలువెత్తు నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళ వ్యక్తులు కాని వారు రాష్ట్రాన్ని పాలించేందుకు ఎలాంటి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని భారతీరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
దివంగత సీఎం జయలలిత మరణం, డీఎంకే చీఫ్ కరుణానిధికి అనారోగ్యంగా ఉండటం వల్లే రాజకీయాల్లోకి వస్తామంటూ కమల్, రజనీ వంటి వాళ్లు బయలుదేరారని, లేకుంటే వాళ్లు బయటకు వచ్చేవారా? అని ప్రశ్నించారు.
వయస్సులో ఉండగా హిమాలయాల వెంట తిరిగిన రజనీకాంత్.. ప్రస్తుతం వయస్సు మళ్లిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తానని వస్తున్నాడని ఎద్దేవా చేశారు. దర్శకుడు సీమాన్‌తో కలసి మీడియాతో మాట్లాడిన భారతీ రాజా.. విశ్వాస ఘాతుకానికి రజనీ నిలువెత్తు నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కనీసం నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్)తో పోటీ పడలేని బీజేపీ, రజనీని అడ్డుపెట్టుకుని బలాన్ని పెంచుకోవాలని చూస్తోందని ఆరోపించారు.