మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (15:16 IST)

మిస్టర్ సి.. నీ తీరును నేను ప్రేమిస్తున్నా : ఉపాసన ట్వీట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తొలి చిత్రం "చిరుత". ఈ చిత్రం విడుదలై ఆదివారానికి 11 యేళ్లు. దీన్ని పురస్కరించుకుని ఆయన భార్య ఉపాసన కామనేని ఓ ట్వీట్ చేశారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తొలి చిత్రం "చిరుత". ఈ చిత్రం విడుదలై ఆదివారానికి 11 యేళ్లు. దీన్ని పురస్కరించుకుని ఆయన భార్య ఉపాసన కామనేని ఓ ట్వీట్ చేశారు.
 
'మిస్టర్‌ సి, మై లవ్‌, నీ జర్నీలో పదకొండేళ్లు పూర్తి చేసుకున్నావు. ఫేమ్‌ని, సక్సెస్‌ని, ఫెయిల్యూర్ ని ఓ పద్ధతిగా హ్యాండిల్‌ చేస్తున్న నీ తీరును నేను ప్రేమిస్తున్నాను. నీ ప్రేమ, బలంలో ఆశ్రయం తీసుకోవడం నేర్చుకున్నాను. తదుపరి పదకొండేళ్లు కూడా నీతో షేర్‌ చేసుకోబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది' అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, 'చిరుత'తో తెరంగేట్రం చేసిన రామ్‌చరణ్‌ "మగధీర" సినిమాతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. 'రంగస్థలం' సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేయడమేకాదు నటుడిగా ఓ స్థాయికి ఎదిగిపోయాడు. ప్రస్తుతం చెర్రీ బోయపాటితో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌ట్రైన్‌మెంట్‌ చిత్రంలో నటిస్తున్నాడు.